
దేశ రాజధాని న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీపావళి వేళ.. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10.00 గంటల సమయంలోపే ఈ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే ఆన్ లైన్‌లో వీటిని కోనుగోలు చేయడంపై నిషేధం విధించింది. కేవలం అనుమతించిన క్యూఆర్ కోడ్ ఉన్న గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు కీలక సూచన చేసింది.