
అమెరికా ట్రెజరీ సెక్రటరీ ‘స్కాట్ బెస్సెంట్’ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు రేర్ ఎర్త్ మెటల్స్’ ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది.