
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది మంగళవారం గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. రైలులో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో
పదో నంబర్ రైల్వే ఫ్లాట్ ఫాం వద్ద అనుమానస్పదంగా కన్పించిన బ్యాగును తీసి పరిశీలించగా గంజాయి చాక్లెట్లు లభించాయి. బ్యాగులో 1.6కిలోల గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బందిని గుర్తించిన గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు.