
కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చామని,
ఐఏఎస్ అధికారులను ప్రభుత్వ ఆస్పత్రులకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించామని స్పష్టం చేశారు. కరోనా విపత్తును ధైర్యంగా ఎదుర్కొన్నాం వివరించారు. కూటమి పాలనలో పేదలకు వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వాల బాధ్యతని, మెరుగైన వైద్యం పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు.