
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా లొంగిపోయారు. మరో ముగ్గురు కీలక నేతలు సహా మొత్తం 60 మందితో కలిసి లొంగిపోయినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు విషయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగుబాటును చూపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం మల్లోజుల వేణుగోపాల్ బృందం పోలీసులకు వద్దకు వెళ్లి సరెండర్ కావడం మావోయిస్టు పార్టీలో కలకలం రేపుతోంది.