
స్పెస్ ఎక్స్ (SpaceX) సంస్థ తాజాగా నిర్వహించిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలో అత్యంత భారీ రాకెట్‌గా పేరు పడ్డ స్టార్ షిప్‌ను అంగారక గ్రహంపై మానవ సహిత అంతరిక్షయానం కోసం అభివృద్ధి చేస్తున్నారు. వ్యోమనౌకను పునర్ వినియోగించుకునేలా డిజైన్ చేశారు. ఈ క్రమంలో తాజాగా 11వ పరీక్షను నిర్వహించారు. టెక్సాస్‌లోని స్టార్ బేస్ కేంద్రం నుంచి స్టార్ షిప్ వ్యోమనౌకను సూపర్ హెవీ బూస్టర్ సాయంతో అంతరిక్షంలోకి ప్రయోగించారు