
<span;>విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మెలోకి వెళుతున్నామని విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఎస్.కృష్ణయ్య ప్రకటించారు. విద్యుత్తు సంస్థల యాజమాన్యంతో సోమవారం సాయంత్రం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లపై స్పష్టత రాలేదని తెలిపారు. 29 డిమాండ్లను యాజమాన్యం ముందుంచగా, ప్రధాన అంశాలపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. స్పష్టత వచ్చేవరకు సమ్మెపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు