
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం ఐక్యంగా పోరాడానికి బీసీ సంఘాలన్నీ జీఏసీగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్ కూడా తాత్కాలికంగా వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘‘తెలంగాణ బీసీ జేఏసీ’’ (BC JAC) ఏర్పాటు అయింది. బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్.కృష్ణయ్య, వైస్ చైర్మన్గా వీజీ నారగోనిలు నియమితులయ్యారు. అలాగే ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ ను ఈ నెల 18కి వాయిదా వేశారు.