
సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల మహాత్మా గాంధీపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో క్షమించమని కోరుతూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు శ్రీకాంత్ అయ్యంగార్. ‘నేను ఇటీవల మాట్లాడిన ఒక విషయం ఎంతో మందికి బాధ కలిగించింది. అది నా ఉద్దేశం కాదని తెలియజేస్తున్నాను. నా మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నన్ను మన్నించండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ నేను శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు.