
<span;>ఆంధ్రప్రదేశ్‌ని వానలు వదలడం లేదు. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో నేటి నుంచి అనగా అక్టోబర్ 12 ఆదివారం నుంచి 14 మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది