
ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందుతుడు అద్దేపల్లి జనార్దనరావును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన విచారణలో మరిన్ని కీలకాంశాలు బయటపడతాయని ఎక్సైజ్అధికారులు భావిస్తున్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తోంది. టీడీపీకి చెందిన నేతలే ఈ కేసులో ఉండటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా కూటమి నేతలపై విమర్శలు ఆగడం లేదు.