
ఆసియా కప్ ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. భారత జట్టు తన చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాలన్న మంకు పట్టుతో ఉన్న నఖ్వీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. అతడిని గట్టిగా మందలించడం లేదా ఐసీసీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం వంటి వాటిలో ఏదో ఒకటి చేయవచ్చని విశ్వసనీయంగా తెలుస్తున్నదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.