
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేతో 42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ సర్కారు ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందని కేటీఆర్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.