
నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కనిపించకుండా పోయారని హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్‌లో ఫిర్యాదు చేశారు.