
నాలుగేళ్లుగా గవర్నర్తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు. అయితే ఒక్కరు మాత్రం రెండు రోజుల క్రితం ప్రచారం చేపట్టారని, ఆయన మరెవరో కాదు, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అని అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్తో పోరాడుతూనే ఉందని, తప్పకుండా తమిళనాడు పోరాడి గెలుస్తుందన్నారు. ఎడప్పాడి పళనిస్వామి లాగే ముఖ్యమంత్రి కూడా అణగిమణిగి ఉంటారని గవర్నర్ భావిస్తున్నారని, అయితే ఆ ఆశలు నెరవేరబోవన్నారు.