
సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్‌ని సస్పెండ్ చేస్తున్నట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. రాకేష్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటూ సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాకేష్ కిశోర్ చేసిన దాడి స్వతంత్ర న్యాయవ్యవస్థపై.. పవిత్రమైన కోర్టు గది కార్యకలాపాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది.