
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అనంతరం పిల్లలందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పిల్లలందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదన్నారు. డ్రైవర్ కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పిల్లలను మరో బస్సులో పాఠశాలకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.