
కొద్ది రోజుల కిందట.. ఆర్బీఐ గ్రామీణ బ్యాంకుల విలీనం గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 4 గ్రామీణ బ్యాంకులు.. ఒకే బ్యాంకింగ్ గ్రూప్‌గా ఏర్పాటు కానున్నాయి. దీంతో 4 బ్యాంకులు ఇక మీదట కనిపించవు. విలీన ప్రక్రియలో భాగంగా.. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనుసంధానంలో భాగంగా.. సాంకేతిక కారణాలతో.. దాదాపు 5 రోజుల పాటు చాలా వరకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటన విడుదల చేసింది.