
తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది. పీసీసీటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం నాడు తన నివాసంలో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. ఎట్టకేలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ‘లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్న. లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న. కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగా’ అంటూ మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.