
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు.అక్టోబర్ 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా మాకరవంలో మెడికల్ కాలేజీని పరిశీలించనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వైసీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే ఈ దరఖాస్తును జిల్లా పోలీసులు తిరస్కరించారు. కేవలం హెలికాప్టర్లో మాత్రమే పర్యటనకు రావాలని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.