
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ ఇప్పుడు ఆందోళన బాట పడుతోంది. ప్రజలకు మేలు చేసే కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని
ఆరోపిస్తున్న జగన్ పార్టీ ఈ నెల పది నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నట్టు జగన్ ప్రకటించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ
ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరించాలని టార్గెట్ పెట్టారు.