
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై మండిపడ్డారు. ఒక రాజ్యసభ సీటు కోసం కమల్ చాలా కాలంగా తన అంతరాత్మను అమ్ముకున్నారు. కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా..? ఆయన మరీ ఇంత దిగజారాలా..? అసలు ఆయన
మాటలను తమిళనాడు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’ అని అన్నామలై అన్నారు.