
మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమధ్యే రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఓట్ల కదన రంగంలో దూకుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుంది. అక్టోబర్ 9న పేర్లు వెల్లడిస్తాం. లిస్ట్ వచ్చాక మీరు ఆశ్చర్యపోతారు. నా పేరు కూడా ఆ జాబితాలో ఉంటుంది