
ఏపీలో నకిలీ మద్యం కేసు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమవుతోంది. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దేపల్లి జనార్ధన్ మీద కేసు నమోదైంది.
ఇబ్రహీంపట్నంలోని ఓ గోడౌన్‌లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివే మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గోడౌన్‌లో భారీగా మద్యం బాటిళ్లు లభ్యం కావటంతో..
కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.