
కల్తీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు చేపట్టారు. దాసరిపల్లి జయచంద్ర రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేశారు. వారిపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా ఈ డంప్ రహస్యంగా నడుస్తోంది. టీడీపీ నేతలు స్థానికంగా రా మెటీరియల్స్‌ను సేకరించుకుని, ఆధునిక యంత్రాలతో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు.