
ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ హమాస్‌కు తుది హెచ్చరిక చేశారు. తాను సూచించినట్టు గాజాపై హమాస్ తన అధికారాన్ని వదులుకోకపోతే భూమ్మీద లేకుండా పోతుందని హెచ్చరించారు. గాజాపై దాడుల నిలిపివేతకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ సిద్ధంగానే ఉన్నారని అన్నారు. అమెరికా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేందుకు ఆయన సిద్ధమేనని చెప్పారు.