
సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం బీహార్‌లో పర్యటించింది.ఒకట్రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని పొలిటికల్ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని జేడీయూ కోరింది.
నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. తొలిసారి ఈవీఎం బ్యాలెట్ షీట్‌పై అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తును కలర్ ఫోటోలతో పాటు, అభ్యర్థుల సీరియల్ నెంబర్లను పెద్దగా ముద్రిస్తామన్నారు. పౌరసత్వం, డేటా ఆఫ్ బర్త్‌కు ఆధార్ సాక్ష్యం కాదని స్పష్టం చేశారు.