
ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత మహిళ జట్టు, పాకిస్థాన్ మహిళ జట్టు మధ్య మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. పాక్ బౌలర్లు భారత బ్యాటర్ల వికెట్లు తీస్తూ స్కోర్‌ని కట్టడి చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో హర్లిన్ డియోల్ 46, రిచా ఘోష్ 35, జెమిమా రోడ్రిక్స్ 32, ప్రతీక రావల్ 31 పరుగులు చేశారు.