
భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌ను కేరళ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా హాజరై మోహన్‌లాల్‌ను సత్కరించారు. మోహన్‌లాల్‌ను ప్రతి మలయాళీకి గర్వకారణంగా అభివర్ణించారు. మలయాళ సినిమా కళాత్మకంగా, వాణిజ్యపరంగా ఎదగడంలో మోహన్‌లాల్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ అడూర్ గోపాలకృష్ణన్ తర్వాత, రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కేరళకు ఈ అత్యున్నత గౌరవాన్ని మోహన్‌లాల్ తీసుకురావడం గొప్ప విషయమన్నారు.