
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొడుతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు వసూలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలని కూడా చూడకుండా లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.