
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి సెప్టెంబర్ 30న పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌కు వెళ్లాడు. ఆరు బీర్లు, మొక్కజొన్న వడలు ఆర్డర్ చేశాడు. ఆర్డర్ మొత్తం రూ. 2,650. అయితే జీఎస్టీ, వ్యాట్‌తోపాటు 20 శాతం
‘ఆవు పన్ను’తో కలిపి మొత్తం రూ. 3,262కు బిల్లు జారీ చేశారు. మద్యంపై Cow Cess On Liquor విధించడం చూసి ఆ కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ బిల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.