
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. మణిపూర్‌లో గత రెండేళ్లుగా అల్లర్లు, హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అక్కడ బీజేపీ ఎంపీలు ఎందుకు సందర్శనకు వెళ్లలేదని ఆయన సూటిగా అడిగారు. మణిపూర్‌లో 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, అయినప్పటికీ కేంద్రం నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు