
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన “ఐబొమ్మ వెబ్‌సైట్ తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది” అన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఈ సమాచారం అసత్యమని, ప్రజలు నమ్మరాదని సూచించింది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో పంచుకుంటున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అంతేకాకుండా, ఆ హెచ్చరికలు పోలీసులకు కాకుండా సినిమా పరిశ్రమను ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ నుంచి ఎలాంటి బెదిరింపులు అందలేదని అధికారికంగా తెలిపింది.