
స్నేహితుడిని కాల్చి చంపి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వెలుగు చూసింది.ఇది కాస్తా వైరల్గా మారి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో అదిల్ అనే యువకుడిపై ఒక యువకుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందుకు సంబంధించిన దృశ్యాలను తన మొబైల్లో రికార్డ్ చేసుకొని ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్షణాల్లో వైరగా మారింది.
.