తాను బీసీసీఐకి ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ
క్షమాపణలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాను బీసీసీఐకి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని.. ఎప్పటికీ అలా చేయబోనని.. భారత మీడియా వాస్తవాలతో కాకుండా అబద్ధాలతోనే వృద్ధి చెందుతుందంటూ ఆరోపించారు.ఏసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

