మాజీ మంత్రి రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తుదిశ్వాస విడిచారు.ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. సూర్యాపేట నుంచి ఒక పర్యాయం ఎంఎల్ఎగా విజయం సాధించారు. 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు

