
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా సందేశం పంచుకున్నారు. దసరా పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయ విలువలను గుర్తుచేస్తూ, ప్రజలందరికీ శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.