
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు చేశారు. పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా
జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీ ఎస్వో కె.వి.మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు. పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలన్నారు.