
అమెరికన్ తెలుగు అసోసియేషన్ IIT Hyderabad తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంజినీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణల్లో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఇటీవల వాషింగ్టన్ డీసీ లో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.