
కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను వేగవంతం చేయడానికి బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే శ్రేయస్కరం అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హాదా కోసం ఎటువంటి రాజకీయ రాజీకి తాను సిద్ధంగా లేనన్నారు. ‘మీరు(ప్రజలు) సిద్ధంగా ఉంటే, నాకు చెప్పండి. ఎందుకంటే దీనికి నేను సిద్ధంగా లేను. ప్రభుత్వంలో బిజెపిని చేర్చుకోవల్సిన అవసరముంటే నా రాజీనామా అంగీకరించండి. ఇక్కడి ఏ ఎంఎల్ఎనైనా ముఖ్యమంత్రిని చేసి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని స్పష్టం చేశారు.