
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులపై నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. పూర్వోదయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ వివరణాత్మక ప్రాతినిధ్యాన్ని సమర్పించారు.