
తమ మధ్యంతర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం సకాలంలోనే సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉందని నేపాల్ ప్రధాని సుశీలా కర్కి వెల్లడించారు. నేపాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో విజయదశమి ఒకటి. బడాదషైన్ అని ఈ పండగను పిలుస్తారు. ఈ సందర్భంగా ప్రధాని కర్కిల్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ షెడ్యూల్ తేదీకే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.