
రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది.2022 నోటిఫికేషన్‌కు సంబంధించిన గ్రూప్ -2 పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్సి) ఆదివారం ప్రకటించింది. 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. నాలుగు విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, వైద్య పరీక్షలు పూర్తి చేసింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, మెరిట్ ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించింది.