
ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగకు నిండుదనం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంబర్‌పేటలో పునరుద్ధరించిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం..
చెరువులో బతుకమ్మలు వదిలి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబర్‌పేట మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు పునరావాసం కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.