
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడడంలో ఎవరైనా భద్రతకు భంగం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. కొత్తగా నియమితులైన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలోని రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు. ‘ప్రజల రక్షణే మా ప్రధాన లక్ష్యం. చట్టం ఎవరికైనా ఒకటే. రౌడీషీటర్లు శాంతి భద్రతల్ని భగ్నం చేయాలని చూస్తే వారిపై పీడీ యాక్ట్లు అమలు చేస్తాం. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.