
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, సినీ వర్గాలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ..
విజయోస్తు…! తండ్రి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.