‘భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు’ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. ఇవాళ (ఆదివారం) ముంబైలోని బీసీసీఐ కార్యాలయం లో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస్ను బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజీవ్ శుక్లా ను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ నియామకంతో జమ్ముకశ్మీర్లో పుట్టి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన తొలి వ్యక్తిగా మిథున్ మన్హాస్ గుర్తింపు పొందారు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అపార అనుభవం ఉన్న మిథున్ మన్హాస్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

