
మంచిర్యాల జిల్లా పెద్దపేట గ్రామంలో బొడ్డు ఐశ్వరి (17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్కడికి ఆమెను కొండాపూర్ గ్రామానికి చెందిన కొండ్లపల్లి అజయ్ తనను ప్రేమించాలని బలవంతం చేసి వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తనను ప్రేమించకపోతే విషం తాగి చనిపోమని ఆమెను కొట్టాడు. జరిగిన విషయం గురించి ఆ విద్యార్థిని తన ఇంట్లో చెప్పి బాధపడింది. అవమానం భరించలేక గడ్డి మందు సేవించింది,చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది.