
ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహూ ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని దేశాల ప్రతినిధులు వాకౌట్ చేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కొన్ని దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యహూ మాట్లాడుతున్న
సమయంలో లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. పాలస్తీనాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాదిస్తున్న పశ్చిమ దేశాలను నెతన్యహూ తప్పుపట్టారు. యూదులను ఊచకోత కోసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.