
పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలను చెబుతోందంటూ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగుమతి చేయడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధానిని కడిగిపారేసిన ఈ యువ దౌత్యవేత్త గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. పేటల్ గహ్లోత్ న్యూఢిల్లీలో జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 2015లో IFS లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ పదేళ్లలో అనేక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.